లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని విపక్ష ఎంపీలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా పబ్లిష్ కాని ఎంఎం నరవణె పుస్తకంపై సభలో మాట్లాడేందుకు రాహుల్‌కు అవకాశాన్ని ఇచ్చేది లేదని ఓంబిర్లా తేల్చి చెప్పారు. దీంతో పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై, లోక్‌సభలో జరిగిన చర్చలో మాట్లాడే అవకాశాన్ని విపక్ష నేత రాహుల్ గాంధీ కోల్పోయారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న విపక్షాలు స్పీకర్ ఓంబిర్లాపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

