వైసిపి నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ వచ్చింది. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అంబటి రాంబాబుకు సోమవారం గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్‌లో ఉన్న అంబటిని కస్టడీ కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు డిస్మిస్ చేసింది. అయితే, మరో కేసులో అంబటి రాంబాబుకు ఫిబ్రబవరి 22వ తేదీ వరకు రిమాండ్ విధించింది

