loader

ఢిల్లీలో వాయు కాలుష్యం.. అమల్లోకి మూడో దశ ఆంక్షలు

దిల్లీలో సగటు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 382 మార్కును తాకి Very Poor కేటగిరీకి చేరడంతో దిల్లీ-ఎన్సీఆర్ వ్యాప్తంగా ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్స‌ స్టేజి-III ఆంక్షలను తక్షణమే అమల్లోకి తెస్తున్నట్లు వెల్లడించింది. అత్యవసరం కాని భవన నిర్మాణాలు, కూల్చివేతలు, తవ్వకాలు, కంకర రోడ్లపై నిర్మాణ సామగ్రి తరలింపుపై పూర్తి నిషేధం విధించారు. అదేవిధంగా బీఎస్-3 పెట్రోల్ కార్లు, బీఎస్-4 డీజిల్ కార్ల రాకపోకలపై కఠిన పరిమితులు అమలవుతాయి. ధూళి కాలుష్యాన్ని పెంచే స్టోన్ క్రషర్లు, గనుల […]

కెప్టెన్‌గా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. బీసీఏ కీలక నిర్ణయం!

దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2026 కోసం బిహార్ క్రికెట్ అసోసియేషన్ (బీసీఏ) 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ టోర్నీలో భాగంగా తొలి రెండు మ్యాచ్‌లకు గానూ టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని బిహార్ సీనియర్ పురుషుల జట్టు కెప్టెన్‌గా ఎంపిక చేయడం విశేషం. 15 ఏళ్లకే కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించి.. ఈ చిచ్చర పిడుగు అరుదైన ఘనతను సాధించాడు.

ట్రాక్టర్ ట్రాలీని ఢీకొన్న ట్రక్కు.. ఐదుగురు మృతి, 17 మందికి సీరియస్!

ఉత్తరప్రదేశ్‌లో ధంతేరస్ పండుగ రోజున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ట్రక్కు ట్రాక్టర్‌ ట్రాలీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ట్రాలీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 17 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. రాయ్‌పూర్ మథియాలో నిర్వహించిన ముండన్ కార్యక్రమం ముగించుకుని పెద్ద సంఖ్యలో ప్రజలు ట్రాక్టర్‌ ట్రాలీలో తిరిగి వస్తున్నారు. కొల్హాఘాట్ వంతెన సమీపానికి చేరుకోగానే వెనుక నుంచి వేగంగా […]

పీజీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన సీట్లు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ వైద్య విద్యను అభ్యసించాలనుకునే మెరిట్ విద్యార్థులకు NMC బిగ్ న్యూస్ చెప్పింది. 2026–27 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రంలోని 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 15 విభిన్న విభాగాల్లో కొత్తగా 161 పీజీ సీట్లకు ఎన్ఎంసీ అనుమతులు మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 163 సీట్ల కోసం ప్రతిపాదనలు పంపగా, రికార్డు స్థాయిలో 98.77 శాతం విజయవంతమై 161 సీట్లకు అనుమతి లభించడం విశేషం. అత్యధికంగా ఆర్థోపెడిక్స్ 27 […]

జగన్ అవమానించడంతో వెళ్లిపోయా: విజయసాయి రెడ్డి

జగన్ అవమానించడంతోనే వైసీపీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చిందని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ముందు పొమ్మనకుండా పొగ బెట్టారని.. అప్పుడప్పుడు జగన్ కూడా అవమానించేసరికి తట్టుకోలేకపోయినట్లు వివరించారు. వైసీపీని వదిలిపోవాలని కలలో కూడా అనుకోలేదని.. తనను వెళ్లగొట్టారని వివరించారు. ప్రతి మనిషికి ఆత్మగౌరవం ఉంటుందని.. దాన్ని దెబ్బతీయాలని ఎవరైనా ప్రయత్నిస్తే ఊరుకుంటారా.. అని ప్రశ్నించారు. ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనను ఎప్పుడూ అవమానించలేదని.. కానీ జగన్ చెప్పుడు మాటలు విని […]

25వ రోజుకు చేరిన NHM ఉద్యోగుల సమ్మె

నాగర్ కర్నూల్ జిల్లా NHM ఉద్యోగుల చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారంతో 25వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఉద్యోగులు మండుటెండను సైతం లెక్కచేయకుండా మండుతున్న ఎండలో కాంక్రీట్ రోడ్డుపై కూర్చొని వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నో సంవత్సరాలుగా ప్రజారోగ్య సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఎన్ హెచ్ ఎం ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి, క్రమబద్ధీకరణతో పాటు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు.

సీజేఐని టార్గెట్ చేస్తారా?.. సుప్రీం కోర్టు ఆగ్రహం

కేరళ కాంగ్రెస్ పార్టీపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ను ఉద్దేశించి ఎక్స్ లో చేసిన పోస్టును తీవ్రంగా పరిగణించిన ధర్మాసనం కేరళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సహా ఆఫీస్ బేరర్లకు నోటీసులు జారీ చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసం న్యాయ వ్యవస్థ స్వతంత్రతను తాకట్టు పెట్టలేమని, అలాగే న్యాయ వ్యవస్థను బెదిరించేందుకు భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుగా పెట్టుకోవద్దని హితవు పలికింది. సుప్రీం కోర్టుకు రాజ్యాంగం మాత్రమే సుప్రీం అనే […]

మత్స్యకారులకు రిలయన్స్ ఫౌండేషన్ భరోసా..

ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత మత్స్యకారులకు రిలయన్స్ ఫౌండేషన్ అండగా నిలిచింది. తుఫాన్ తీవ్రతకు కొట్టుకుపోయి, బురదలో కూరుకుపోయిన మత్స్యకారుల పడవలను తిరిగి వెలికితీసేందుకు ప్రత్యేక సహాయక చర్యలను చేపట్టింది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దాదాపు 180కి పైగా దెబ్బతిన్న బోట్లను సురక్షితంగా బయటకు తీసి, మత్స్యకారుల జీవనోపాధిని పునరుద్ధరించేందుకు రంగంలోకి దిగింది. నిపుణుల పర్యవేక్షణలో చేపడుతున్న ఈ కార్యక్రమం ద్వారా తీర ప్రాంతంలోని సుమారు 10,000 మందికి పైగా లబ్ధి చేకూరనుంది.

రేపే పరిషత్‌ తీర్పు – మ.3 గంటల వరకు ఫలితాలు వెల్లడయ్యే అవకాశం

రాష్ట్రంలో రేపు జరిగే పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌ పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఎస్​ఈసీ అనిల్‌ చంద్ర పునేఠా తెలిపారు ఎస్​ఈసీ తెలిపిన వివరాల ప్రకారం ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కించిన తర్వాత బ్యాలెట్ బాక్స్​లను అభ్యర్థుల, ఏజెంట్ల సమక్షంలో తెరుస్తారు. 28 జిల్లాల్లో మొత్తం 365 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 9 వేలకు పైగా కౌంటింగ్ టేబుల్​లను ఉంచారు. 11 వేలకు పైగా కౌంటింగ్ సూపర్​వైజర్లు విధులను నిర్వర్తిస్తారు. వీరితోపాటు 28500 మంది కౌంటింగ్ […]

మోడీ ఇంట్లో క్రికెటర్ సూర్య కుమార్ – కూతురు పాటకు ప్రధాని చప్పట్లు..!

ధంతెరాస్ సందర్భంగా ప్రధాని మోడీని సూర్య కుటుంబంతో సహా వెళ్లి కలుసుకున్నారు. ఈ సందర్భంగా మోడీ సూర్య, ఆయన భార్య, పిల్లల్ని పలకరించి ఆహ్లాదంగా గడిపారు. సూర్యకుమార్ యాదవ్ తో పాటు వచ్చిన తన పిల్లలతోనూ మోడీ చక్కగా సంభాషిస్తూ కనిపించారు. అలాగే సూర్య కూతురు పాత పాడుతుంటే, దానికి మురిసిపోతూ ప్రధాని చప్పట్లు కొడుతున్న దృశ్యాల వీడియోలు సోషల్ మీడియాలో నిమిషాల్లోనే వైరల్ అవుతున్నాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON