ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ వైద్య విద్యను అభ్యసించాలనుకునే మెరిట్ విద్యార్థులకు NMC బిగ్ న్యూస్ చెప్పింది. 2026–27 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రంలోని 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 15 విభిన్న విభాగాల్లో కొత్తగా 161 పీజీ సీట్లకు ఎన్ఎంసీ అనుమతులు మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 163 సీట్ల కోసం ప్రతిపాదనలు పంపగా, రికార్డు స్థాయిలో 98.77 శాతం విజయవంతమై 161 సీట్లకు అనుమతి లభించడం విశేషం. అత్యధికంగా ఆర్థోపెడిక్స్ 27 పీజీ సీట్లు మంజూరయ్యాయి.