ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత మత్స్యకారులకు రిలయన్స్ ఫౌండేషన్ అండగా నిలిచింది. తుఫాన్ తీవ్రతకు కొట్టుకుపోయి, బురదలో కూరుకుపోయిన మత్స్యకారుల పడవలను తిరిగి వెలికితీసేందుకు ప్రత్యేక సహాయక చర్యలను చేపట్టింది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దాదాపు 180కి పైగా దెబ్బతిన్న బోట్లను సురక్షితంగా బయటకు తీసి, మత్స్యకారుల జీవనోపాధిని పునరుద్ధరించేందుకు రంగంలోకి దిగింది. నిపుణుల పర్యవేక్షణలో చేపడుతున్న ఈ కార్యక్రమం ద్వారా తీర ప్రాంతంలోని సుమారు 10,000 మందికి పైగా లబ్ధి చేకూరనుంది.