నాగర్ కర్నూల్ జిల్లా NHM ఉద్యోగుల చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారంతో 25వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఉద్యోగులు మండుటెండను సైతం లెక్కచేయకుండా మండుతున్న ఎండలో కాంక్రీట్ రోడ్డుపై కూర్చొని వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నో సంవత్సరాలుగా ప్రజారోగ్య సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఎన్ హెచ్ ఎం ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి, క్రమబద్ధీకరణతో పాటు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు.

