కేరళ కాంగ్రెస్ పార్టీపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ను ఉద్దేశించి ఎక్స్ లో చేసిన పోస్టును తీవ్రంగా పరిగణించిన ధర్మాసనం కేరళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సహా ఆఫీస్ బేరర్లకు నోటీసులు జారీ చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసం న్యాయ వ్యవస్థ స్వతంత్రతను తాకట్టు పెట్టలేమని, అలాగే న్యాయ వ్యవస్థను బెదిరించేందుకు భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుగా పెట్టుకోవద్దని హితవు పలికింది. సుప్రీం కోర్టుకు రాజ్యాంగం మాత్రమే సుప్రీం అనే విషయం మర్చిపోవద్దని హితవు పలికింది.

