ప్రత్యర్థులు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తారు – సంయమనం పాటించాలి: సీఎం చంద్రబాబు
పోలింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా కూటమి శ్రేణులు క్షేత్రస్థాయిలో మరింత చురుగ్గా పని చేయాలని సీఎం చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ సరళి, క్షేత్రస్థాయిలో పరిస్థితులపై కూటమి పార్టీల ముఖ్యనేతలు, కేడర్‌తో సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటే వెంటనే ఎన్నికల అధికారులు, పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలని ఆదేశించారు. ప్రత్యర్థులు రెచ్చగొట్టేలా కుట్రపూరితంగా వ్యవహరించే అవకాశం ఉందని కూటమి శ్రేణులు సంయమనం పాటించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

