గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కలిసి తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం ‘RC17’ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. నవంబర్ 1న హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోలో ఈ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై సినిమా కోసం తొలి క్లాప్ కొట్టారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.