loader

రామ్ చరణ్–సుకుమార్ RC17 ప్రారంభం

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కలిసి తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం ‘RC17’ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. నవంబర్ 1న హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఈ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై సినిమా కోసం తొలి క్లాప్ కొట్టారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నారాయణ కాలేజీ బస్సులను అడ్డుకున్న వైఎస్‌ఎర్సీపీ నేతలు

నెల్లూరులో జరుగుతున్న ఎన్నికల్లో రిగ్గింగ్‌కు మంత్రి నారాయణ స్కెచ్‌ వేశారు. ఇందుకోసం ఆయన నారాయణ కాలేజీ బస్సులను వినియోగిస్తుండగా వైఎస్‌ఎర్సీపీ నేతలు అడ్డుకున్నారు. నెల్లూరు సిటీ డివిజన్లలోలో దొంగ ఓట్లు పోలింగ్‌కు మంత్రి నారాయణ స్కెచ్ వేశారు. దీనిలో భాగంగా 14, 16, 17 తో సహా పలు డివిజన్స్ పోలింగ్ స్టేషన్స్ వద్దకు బస్సులో నారాయణ కళాశాల విద్యార్థులు చేరుకున్నారు. దీంతో బస్సుల ఆపి ఎక్కడికి వెళ్తున్నారని వైసిపీ శ్రేణులు నిలదీయగా, విద్యార్థులు మొహం చాటేశారు.

ఏపీలో మున్సిపల్ ఎన్నికల వేడి – టీడీపీ, వైఎస్సార్సీపీ మధ్య ఘర్షణలు

మున్సిపల్ ఎన్నికల వేళ అనంతపురంలోని నగరపాలక సంస్థ పరిధిలో పలు డివిజన్లలో టీడీపీ-వైఎస్సార్సీపీ నాయకుల మధ్య స్వల్ప ఘర్షణలు జరిగాయి. 38వ డివిజన్ పరిధిలో టీడీపీ నేతలు గుర్తుతెలియని వ్యక్తులతో దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులను వెంబడించి వారిపై దాడి చేశారు. దీంతో టీడీపీ- వైఎస్సార్సీపీ నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని వారిని అక్కడి నుంచి పంపించేశారు.

మోడీపై విమర్శలు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో పేదల ఓట్లను తొలగిస్తూ బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆయన ఆరోపించారు. రావణుడిని ఓడించడానికి వానర సైన్యం వచ్చినట్లుగానే, మోడీని గద్దె దించేందుకు తాము వచ్చామని పేర్కొన్నారు. రాంలీలా మైదాన్ వేదికగా ఓటు చోరీపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ప్రకటించారు. నరేంద్ర మోడీని మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకే దేశవ్యాప్తంగా 13.5 కోట్ల ఓట్లను తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కనిగిరిలో అత్యధిక పోలింగ్.. ఒంటిగంటకు నమోదైన శాతాలివీ..

మున్సిపల్ ఎన్నికలలో రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు 37.13 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అత్యధికంగా మార్కాపురం జిల్లా కనిగిరి మున్సిపాలిటీలో 61.86 శాతం పోలింగ్ నమోదైంది. ఆ తర్వాతి స్థానాల్లో జమ్మలమడుగు 61.86, నగరిలో 60.81 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. నగరపాలక సంస్థల్లో విజయవాడలో 36.40, అనంతపురంలో 32.60, తిరుపతిలో 32.57, కడపలో 30.75, విశాఖపట్నంలో 27.55 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాల వారీగా పోలింగ్ శాతం

రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం ఒంటిగంట వరకు 37.13 శాతం పోలింగ్

ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. 92 పట్టణ స్థానిక సంస్థల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్‌ జరుగుతోంది. ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్దకు ఓటర్లు ఉత్సాహంగా తరలివస్తున్నారు. ఆదివారం ఉదయం ఒంటి గంట వరకు రాష్ట్రవ్యాప్తంగా 37.13 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

వైఎస్‌ జగన్‌ కాన్వాయ్‌ ఎదుట దస్తగిరి హల్‌చల్‌

మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కాన్వాయ్ ముందుకు వచ్చి వివేకా హత్య కేసు హంతకుడు దస్తగిరి హాల్ చల్ చేశాడు. ఇందుకు పోలీసులు సహకరించినట్టు వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కావాలనే కాన్వాయ్‌లోకి అనుమతించి.. ఆ తర్వాత పక్కకు తప్పించినట్లు డ్రామా చేశారని అన్నారు. ఒక హత్య కేసులో ముద్దాయిని జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న వీఐపీ కాన్వాయ్‌లోకి ఎలా అనుమతించారని ప్రశ్నించారు. దస్తగిరితో టీడీపీ […]

రామ్‌లీలా మైదానానికి ర్యాలీగా ముఖ్యనేతలు- ఓపెన్‌ టాప్‌ జీపులో రాహుల్​

CEC, S.I.R.కు వ్యతిరేకంగా ఇండియా కూటమి నిర్వహిస్తున్న చలో దిల్లీ ర్యాలీలో ప్రారంభమైంది. ముఖ్యనేతలంతా ఓపెన్‌ టాప్‌ జీపులో రామ్‌లీలా మైదానానికి బయలుదేరారు. పాల్గొనేందుకు ప్రతిపక్ష పార్టీల శ్రేణులు రామ్‌లీలా మైదానానికి చేరుకుంటున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన ప్రతిపక్ష పార్టీల శ్రేణులతో రాజధాని వీధులు రద్దీగా మారాయి. ‘చలో దిల్లీ’మార్చ్‌ కన్నాట్ ప్లేస్‌లోని మింటోరోడ్ జంక్షన్ వద్ద నుంచి రామ్‌లీలా మైదానం వరకు సాగనుంది.

న్యాయాధికారులకు గుడ్‌న్యూస్.. రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంపు!

తెలంగాణలో న్యాయాధికారులకు రాష్ట్ర ప్రభుత్వం వారి పదవీ విరమణ వయసును 61 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ (రెగ్యులేషన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సూపరాన్యుయేషన్) చట్టం–1984కు సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలు, తెలంగాణ హైకోర్టు ఫుల్ కోర్టు సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ప్రకారం ఈ సవరణ 2026 మార్చి 31 […]

పులివెందుల ఆర్వో కార్యాలయం వద్ద బైఠాయించిన వైఎస్‌ జగన్‌

పులివెందుల ఆర్వో కార్యాలయం ముందు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిరసన తెలిపారు. 70 మంది వైఎస్సార్‌సీపీ ఏజెంట్లతో కలిసి బైఠాయించారు. ఆర్వో శ్రీనివాస్‌, ఆర్డీవో చిన్నయ్యతో మాట్లాడిన వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను అడ్డుకోవడంపై ప్రశ్నించారు. ఎన్నికల అక్రమాలపై ఆయన ఫిర్యాదు చేశారు. ‘‘ఎలక్షన్‌ అంటే పోటీ జరగాలి. ఎక్కడ చూసినా టీడీపీ గూండాలే కనబడుతున్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు లేవు’’ అంటూ అధికారులను వైఎస్‌ జగన్‌ నిలదీశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON