ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో పేదల ఓట్లను తొలగిస్తూ బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆయన ఆరోపించారు. రావణుడిని ఓడించడానికి వానర సైన్యం వచ్చినట్లుగానే, మోడీని గద్దె దించేందుకు తాము వచ్చామని పేర్కొన్నారు. రాంలీలా మైదాన్ వేదికగా ఓటు చోరీపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ప్రకటించారు. నరేంద్ర మోడీని మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకే దేశవ్యాప్తంగా 13.5 కోట్ల ఓట్లను తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.