పులివెందుల ఆర్వో కార్యాలయం ముందు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరసన తెలిపారు. 70 మంది వైఎస్సార్సీపీ ఏజెంట్లతో కలిసి బైఠాయించారు. ఆర్వో శ్రీనివాస్, ఆర్డీవో చిన్నయ్యతో మాట్లాడిన వైఎస్ జగన్.. వైఎస్సార్సీపీ ఏజెంట్లను అడ్డుకోవడంపై ప్రశ్నించారు. ఎన్నికల అక్రమాలపై ఆయన ఫిర్యాదు చేశారు. ‘‘ఎలక్షన్ అంటే పోటీ జరగాలి. ఎక్కడ చూసినా టీడీపీ గూండాలే కనబడుతున్నారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు లేవు’’ అంటూ అధికారులను వైఎస్ జగన్ నిలదీశారు.