<span;>విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఓల్డ్ రాజరాజేశ్వరి పేట 55వ డివిజన్ బ్యాలెట్ పేపర్లో గుర్తులు తారుమారు కావడంతో ఫిర్యాదు చేశారు. వైసీపీ అభ్యర్థి షేక్ హసన్ బాషా పేరు ఎదుట హస్తం గుర్తు, కాంగ్రెస్ అభ్యర్థి షరీఫ్ షేక్ పేరు ఎదుట ఫ్యాన్ గుర్తు ముద్రించినట్లు గుర్తించారు. దీనిపై వైసీపీ అభ్యర్థి ఫిర్యాదు చేయడంతో రిటర్నింగ్ ఆఫీసర్ చక్రవర్తి పోలింగ్‌ను నిలిపివేశారు. కొత్త బ్యాలెట్ పేపర్లు ముద్రించిన తర్వాత పోలింగ్ పునఃప్రారంభించనున్నారు. ఈ పొరపాటు వల్ల పోలింగ్ దాదాపు రెండు గంటలు ఆలస్యమయ్యే అవకాశముంది.