పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పలు జిల్లాల్లో వైసీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఉద్రిక్తతలకు అవకాశం ఉండటంతో పల్నాడు జిల్లా వ్యాప్తంగా YSRCP ముఖ్య నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మాచర్లలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజిని, వినుకొండలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడులను తమ నివాసాలకే పరిమితం చేస్తూ పోలీసులు నోటీసులు జారీ చేశారు.