దిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించనున్న సభ కోసం ఇండియా కూటమి శ్రేణులు భారీగా తరలివస్తున్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఈ మైదానానికి చేరుకున్నారు. దీంతో భద్రతా బలగాలు, పోలీసులు అప్రమత్తమయ్యారు. దేశరాజధానిలో సాయుధ దళాలు, సీఆర్పీఎఫ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సహా దాదాపు 10వేల మంది సిబ్బంది మోహరించారు. మరోవైపు నిరసనల్లో పాల్గొనడానికి ఎస్ఎఫ్ఐ నేతలు ఇప్పటికే రాంలీలా మైదాన్‌కు ర్యాలీగా బయల్దేరారు. జంతర్ మంతర్, సుప్రీంకోర్టు, ఈసీ కార్యాలయాల వద్ద బహుళ అంచెల బారికేడ్లను ఏర్పాటు చేశారు.