పట్టణ సంస్థల ఎన్నికల్లో కూటమి దౌర్జన్యానికి పాల్పడిందని, దొడ్డిదారిన గెలుపునకు కుట్రలు పన్నిందని వైసీపీ అధ్యక్షుడు , మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పులివెందుల పులివెందులలో 80 పోలింగ్ బూత్‌లు ఉండగా 70 బూతుల్లో వైసీపీ ఏజెంట్లు లేరని ఆరోపించారు. తమ ఏజెంట్లు బూత్‌లోకి రాకుండా అడ్డుకున్నారని విమర్శించారు. పోలీసులు టీడీపీకి సహకరిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికలు రద్దు చేసి రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేశారు. చైర్పర్సన్ అభ్యర్థి ప్రమీల పైనా దాడి చేశారని , ఇదీ ప్రజాస్వామ్యమేనా అంటూ ప్రశ్నించారు.