నెల్లూరులో జరుగుతున్న ఎన్నికల్లో రిగ్గింగ్‌కు మంత్రి నారాయణ స్కెచ్ వేశారు. ఇందుకోసం ఆయన నారాయణ కాలేజీ బస్సులను వినియోగిస్తుండగా వైఎస్ఎర్సీపీ నేతలు అడ్డుకున్నారు. నెల్లూరు సిటీ డివిజన్లలోలో దొంగ ఓట్లు పోలింగ్‌కు మంత్రి నారాయణ స్కెచ్ వేశారు. దీనిలో భాగంగా 14, 16, 17 తో సహా పలు డివిజన్స్ పోలింగ్ స్టేషన్స్ వద్దకు బస్సులో నారాయణ కళాశాల విద్యార్థులు చేరుకున్నారు. దీంతో బస్సుల ఆపి ఎక్కడికి వెళ్తున్నారని వైసిపీ శ్రేణులు నిలదీయగా, విద్యార్థులు మొహం చాటేశారు.