రాప్తాడులో దారుణ దాడికి గురై తీవ్రంగా గాయపడిన విద్యార్థినికి వైద్యులు నిర్వహించిన రెండు కీలక శస్త్రచికిత్సలు విజయవంతమయ్యాయి. బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో బాలికకు ఆర్థోపెడిక్, ప్లాస్టిక్ సర్జరీలు పూర్తి చేసినట్లు ఏపీ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ఆదివారం మధ్యాహ్నం తాను స్వయంగా బెంగళూరులోని ఆసుపత్రికి వెళ్లి బాలిక ఆరోగ్య పరిస్థితిని సమీక్షించనున్నట్లు మంత్రి వెల్లడించారు. అక్కడి వైద్యులతో మాట్లాడి తదుపరి చికిత్సకు సంబంధించిన వివరాలను తెలుసుకుంటానని చెప్పారు.