మున్సిపల్ ఎన్నికల్లో చోటు చేసుకున్న దారుణాలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘నేను ఓటు వేయను.. రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులు ప్రజలకు తెలియాలి. ఓటేస్తే అంతా సవ్యంగా ఉందనే భ్రమ కలుగుతుంది, కానీ ఇక్కడ ఓటు వేసే పరిస్థితులు ఏమాత్రం ఇక్కడ రీపోలింగ్ పెడితే అప్పుడొచ్చి ఓటేస్తా. టీడీపీ అరాచకాలపై న్యాయపోరాటం చేస్తాం, కోర్టుకు వెళతాం. ప్రజా స్వామ్యాన్ని కాపాడుకోకపోతే ఈరోజు మీ ఓటు పోతుంది.. రేపు మీ ఆస్తులే పోతాయి’అంటూ జగన్ ఓటర్లను అప్రమత్తం చేశారు.