loader

రాప్తాడు ఘటన.. బాలికపై దాడి చేసింది వీడే..

రాప్తాడు హైస్కూల్ ఘటనలో నిందితుడు హేమంత్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ధర్మవరం రైల్వే స్టేషన్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. హేమంత్‌ను బాలిక గోపిక బంధువుగా అనుమానిస్తున్నారు. టెన్త్ క్లాస్ విద్యార్థి గోపిక ప్రేమకు నిరాకరించడంతో ఉన్మాదిగా మారిన హేమంత్.. ఎలక్ట్రిక్‌ రంపంతో విచక్షణరహితంగా దాడి చేశాడు. ధర్మవరం మండలం నాగలూరికి చెందిన హేమంత్‌.. తల్లిదండ్రులు చనిపోవడంతో కొన్నాళ్లుగా అయ్యవారిపల్లెలో అక్క దగ్గరే నివాసం ఉంటున్నాడు. కొద్దిరోజులుగా ప్రేమ పేరుతో బాలికను ఉన్మాది వేధిస్తున్నాడు.

అఖండ భారత నిర్మాత, జాతి ఉక్కు మనిషి: పటేల్‌కు ప్రధాని, రాష్ట్రపతి నివాళి

ఉక్కుమనిషి, మాజీ ఉపప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఘనంగా నివాళి అర్పించారు. గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో ఉన్న పటేల్ భారీ విగ్రహం ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ వద్ద ప్రధాని పుష్పాంజలి ఘటించారు. దేశ సమగ్రతకు, భారతజాతి నిర్మాణానికి ఆయన చేసిన సేవలను మోదీ కొనియాడారు. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు ఇతర ప్రముఖులు పటేల్‌కు పుష్పాంజలి ఘటించారు.

ఏపీకి మరో తుఫాన్ ముప్పు.. భారీ వర్షాల హెచ్చరిక

ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న అండమాన్ సముద్ర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది రాబోయే 6 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు. ఇది మరింత బలపడి రేపు (ఆదివారం) సాయంత్రానికి తుఫాన్‌గా మారే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించారు. సోమవారం (నవంబర్ 2) సాయంత్రానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆంధ్రప్రదేశ్ తీరం సమీపంలోని చేరుకునే అవకాశం ఉందన్నారు. సోమ, మంగళవారాల్లో సెంట్రల్ ఆంధ్రా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా భారీ […]

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు.. 40 మంది అభ్యర్థులతో ఆప్ తొలి జాబితా..

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కసరత్తు ప్రారంభించింది. 2027లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే 40 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ప్రకటించింది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మరోసారి ధురి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. అసెంబ్లీ స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వాన్‌కు కోట్‌కపురా టికెట్ కేటాయించారు. ఎన్నికలకు ఇంకా కొన్ని నెలల సమయం ఉండగానే అభ్యర్థులను ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది

ఏపీ వ్యాప్తంగా ప్రారంభమైన ఎన్నికల సామగ్రి పంపిణీ

ఏపీలో మున్సిపల్ పోలింగ్ కోసం ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది సామగ్రి పంపిణీ కేంద్రాలకు చేరుకుంటున్నారు. యంత్రాంగం ఎన్నికల సామగ్రి పంపిణీని పర్యవేక్షిస్తోంది. నగరపాలక, పురపాలిక, నగర పంచాయతీల్లో ఆదివారం పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 3న ఫలితాలు వెల్లడించనున్నారు.

రాప్తాడు విద్యార్థిని దాడి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియన్..

రాప్తాడులో పాఠశాల విద్యార్థినిపై జరిగిన అమానుష దాడి ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల తరగతి గదిలోనే రంపంతో విద్యార్థినిపై దాడి చేయడం అత్యంత అమానుషమన్నారు సీఎం చంద్రబాబు. దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశారు జారీ చేశారు. బాలికకు మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

మీ ఓటు, పోలింగ్ బూత్ ఎక్కడుందో సులభంగా తెలుసుకోవచ్చు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌ https://sec-ems.ap.gov.in/apsec/ ఓపెన్ చేయగానే అక్కడ ఓటర్‌ పోర్టల్ ఆప్షన్ ఉంటుంది.. దానిపై క్లిక్‌ చేయగానే ఏడు రకాల సేవలు కనిపిస్తాయి. అక్కడ పేరు, ఐడీ కార్డు నంబరు ద్వారా ఓటుకు సంబంధించిన వివరాలు సెర్చు చేయొచ్చు. ఓటర్ కార్డు డౌన్‌లోడ్, పోలింగ్‌ స్టేషన్‌ వివరాలు తెలుసుకునేందుకు వేర్వేరుగా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలు, పోలింగ్‌ సరళి, ఫలితాలను కూడా తెలుసుకునే అవకాశం కల్పించారు.

100 మంది జానపద రిథమ్ ప్లేయర్లతో టైటిల్ సాంగ్

రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ తనదైన శైలిలో జానపద సంగీతంలోని అసలైన పవర్ ను ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యారు. దేశవ్యాప్తంగా వివిధ సంస్కృతులకు ప్రాతినిధ్యం వహించే 100 మంది సంప్రదాయ జానపద రిథమ్ ప్లేయర్లతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్‌ను రికార్డ్ చేస్తున్నారు. రాక్‌స్టార్ డీఎస్పీ నటుడిగా అరంగేట్రం చేస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు ‘బలగం’ ఫేమ్ వేణు యెల్దండి దర్శకత్వం వహిస్తున్నారు. 100 మంది జానపద రిథమ్ ప్లేయర్లు.. ఒక్కటై మోగనున్న శక్తివంతమైన సంగీత హోరు తో ‘ఎల్లమ్మ’ టైటిల్ […]

యలహంక ఆస్తి నాదే.. నా పిల్లలదే: వైఎస్ షర్మిల

యలహంక ఆస్తి వివాదంపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి స్పందించారు. బెంగళూరులోని యలహంక ఆస్తిపై తనకు, తన పిల్లలకు 100 శాతం హక్కు ఉందని ఆమె స్పష్టం చేశారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి నివసించిన ఇల్లు కావడంతో తన కుమార్తె అంజిలి కోరిక మేరకు అక్కడే వివాహ వేడుక నిర్వహించాలని భావించినట్లు షర్మిల తెలిపారు. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అక్కడ పెళ్లి జరిపించడం సాధ్యం కాకపోవడంతో మరో ప్రాంతంలో వివాహం నిర్వహించాలని […]

రంపంతో 10వ తరగతి విద్యార్థిని గొంతు కోసిన ఉన్మాది

10వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై చెట్లను, కలపను కోసే రంపంతో విచక్షణారహితంగా దాడి చేసి గొంతు కోశాడు. పాఠశాల సమయాల్లో అందరూ చూస్తుండగానే ఈ ఘాతుకానికి పాల్పడటంతో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. రక్తం మడుగులో పడిపోయిన విద్యార్థిని తీవ్ర గాయాలపాలైంది. తోటి విద్యార్థుల ఆర్తనాదాలు విన్న పాఠశాల ఉపాధ్యాయులు, స్థానికులు వెంటనే అప్రమత్తమై బాలికను హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON