యలహంక ఆస్తి వివాదంపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి స్పందించారు. బెంగళూరులోని యలహంక ఆస్తిపై తనకు, తన పిల్లలకు 100 శాతం హక్కు ఉందని ఆమె స్పష్టం చేశారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి నివసించిన ఇల్లు కావడంతో తన కుమార్తె అంజిలి కోరిక మేరకు అక్కడే వివాహ వేడుక నిర్వహించాలని భావించినట్లు షర్మిల తెలిపారు. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అక్కడ పెళ్లి జరిపించడం సాధ్యం కాకపోవడంతో మరో ప్రాంతంలో వివాహం నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.