మహబూబాబాద్ జిల్లా కురవి మండలం తిర్లాపురం వద్ద గీతాంజలి స్కూలుకు చెందిన ఆటో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. డ్రైవర్ మొబైల్ ఫోన్ మాట్లాడుతూ, అజాగ్రత్తగా వాహనాన్ని నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. వాహనంలో మొత్తం 14 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. వీరిలో నలుగురు విద్యార్థులకు గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు విద్యార్థులందరినీ నీటి నుంచి సురక్షితంగా బయటకు తీసి, గాయపడిన విద్యార్థులను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.