రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 మోడల్ స్కూళ్లను సమగ్రమైన ‘తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు’గా తీర్చిదిద్దేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ విద్యా సంస్కరణ ద్వారా పాఠశాలల స్థాయిని మరింత పెంచి, విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పాఠశాలల్లో కేవలం ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు మాత్రమే ప్రవేశాలు ఉండేవి. అయితే, విద్యార్థుల సౌలభ్యం కోసం ఇకపై ఒకటి నుంచి ఐదో తరగతి వరకు కూడా ప్రాథమిక విభాగాన్ని ప్రారంభించనున్నారు.