భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో అపూర్వ ఘనతను సాధించింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన GSLV-F18-NVS-03 అంతరిక్ష ప్రయోగం విజయవంతమైంది ప్రయోగం విజయవంతం కావడం పట్ల దేశ ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో శాస్త్రవేత్తలను, సాంకేతిక నిపుణులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. శాస్త్రవేత్తల కఠిన శ్రమ, పట్టుదల వలనే దేశం అంతరిక్ష రంగంలో నూతన శిఖరాలను అధిరోషిస్తోందని ప్రధాని కొనియాడారు.