ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (IIFA) అవార్డ్స్ 2026 విజేతల జాబితా విడుదలైంది. 26వ ఐఫా అవార్డుల్లో రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సినిమా సత్తా చాటింది. ప్రధాన విభాగాల్లో ఏకంగా 12 అవార్డులను సొంతం చేసుకుని ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ సినిమాలో నటనకు గానూ రణ్వీర్ సింగ్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. ‘సైయారా’ చిత్రంలో నటించిన అనీత్ పడ్డా ఉత్తమ నటిగా ఎంపికయ్యారు.