సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం, యాజమాన్యం దీపావళి బోనస్ ప్రకటించింది. సింగరేణి కార్మికులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. నవంబర్ 5న బోనస్ చెల్లించనున్నట్టు తెలిపారు. అర్హుడైన ఒక్కో కార్మికుడికి గరిష్టంగా రూ.1,10,250 వరకు బోనస్ లభించనుంది. ఇందుకోసం సింగరేణి యాజమాన్యం రూ.419 కోట్లు కేటాయించింది. దాదాపు 38వేల మంది కార్మికులు లబ్ధి పొందనున్నారు. దీపావళి బోనస్ మొత్తాన్ని నవంబర్ 5వ తేదీన కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్టు అధికారులు తెలిపారు.

