వచ్చే ఏడాది జనవరి 25 నుంచి దేశవ్యాప్తంగా జనగణన చేపట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఎన్నికలు జరిగే రాష్ట్రాలు, మంచు తీవ్రత ఉండే ప్రాంతాలు మినహా అన్ని రాష్ట్రాల్లో ఫిబ్రవరి 28 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపింది. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపుర్, గోవాలతోపాటు లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్లోని జనగణన ఉండదని పేర్కొంది.రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ జారీ చేసింది. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలను సేకరించనున్నారు