మధ్యప్రాచ్యంలోని అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో 27 మంది భారతీయ సిబ్బంది ప్రయాణిస్తున్న ఆయిల్ ట్యాంకర్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. పనామా దేశపు జెండాతో సంచరిస్తున్న ‘ఎంటీ లూయిస్-1’ నౌకను లక్ష్యంగా చేసుకుని లింపెట్ మైన్స్‌తో ఈ పేలుళ్లకు పాల్పడినట్లు తేలింది. ఈ ప్రమాదంలో నౌకలోని సిబ్బంది సురక్షితంగా బయటపడినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఒమన్ తీరానికి దాదాపు 25 నాటికల్ మైళ్ల దూరంలో ఒక చిన్న పడవలో వచ్చిన దుండగులు నౌక హల్ భాగానికి రెండు లింపెట్ మైన్స్‌ను అంటించారు.