10వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై చెట్లను, కలపను కోసే రంపంతో విచక్షణారహితంగా దాడి చేసి గొంతు కోశాడు. పాఠశాల సమయాల్లో అందరూ చూస్తుండగానే ఈ ఘాతుకానికి పాల్పడటంతో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. రక్తం మడుగులో పడిపోయిన విద్యార్థిని తీవ్ర గాయాలపాలైంది. తోటి విద్యార్థుల ఆర్తనాదాలు విన్న పాఠశాల ఉపాధ్యాయులు, స్థానికులు వెంటనే అప్రమత్తమై బాలికను హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.