పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కసరత్తు ప్రారంభించింది. 2027లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే 40 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ప్రకటించింది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మరోసారి ధురి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. అసెంబ్లీ స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వాన్కు కోట్కపురా టికెట్ కేటాయించారు. ఎన్నికలకు ఇంకా కొన్ని నెలల సమయం ఉండగానే అభ్యర్థులను ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది