రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ తనదైన శైలిలో జానపద సంగీతంలోని అసలైన పవర్ ను ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యారు. దేశవ్యాప్తంగా వివిధ సంస్కృతులకు ప్రాతినిధ్యం వహించే 100 మంది సంప్రదాయ జానపద రిథమ్ ప్లేయర్లతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్‌ను రికార్డ్ చేస్తున్నారు. రాక్‌స్టార్ డీఎస్పీ నటుడిగా అరంగేట్రం చేస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు ‘బలగం’ ఫేమ్ వేణు యెల్దండి దర్శకత్వం వహిస్తున్నారు. 100 మంది జానపద రిథమ్ ప్లేయర్లు.. ఒక్కటై మోగనున్న శక్తివంతమైన సంగీత హోరు తో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించేందుకు సిద్ధమవుతోంది.