ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ https://sec-ems.ap.gov.in/apsec/ ఓపెన్ చేయగానే అక్కడ ఓటర్ పోర్టల్ ఆప్షన్ ఉంటుంది.. దానిపై క్లిక్ చేయగానే ఏడు రకాల సేవలు కనిపిస్తాయి. అక్కడ పేరు, ఐడీ కార్డు నంబరు ద్వారా ఓటుకు సంబంధించిన వివరాలు సెర్చు చేయొచ్చు. ఓటర్ కార్డు డౌన్లోడ్, పోలింగ్ స్టేషన్ వివరాలు తెలుసుకునేందుకు వేర్వేరుగా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలు, పోలింగ్ సరళి, ఫలితాలను కూడా తెలుసుకునే అవకాశం కల్పించారు.

