ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న అండమాన్ సముద్ర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది రాబోయే 6 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు. ఇది మరింత బలపడి రేపు (ఆదివారం) సాయంత్రానికి తుఫాన్‌గా మారే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించారు. సోమవారం (నవంబర్ 2) సాయంత్రానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆంధ్రప్రదేశ్ తీరం సమీపంలోని చేరుకునే అవకాశం ఉందన్నారు. సోమ, మంగళవారాల్లో సెంట్రల్ ఆంధ్రా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురవనున్నట్లు తెలిపారు