loader

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ

మాదాపూర్‌లో కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పిఎంఏవై-జి (PMAY-G) ఇండ్ల కేటాయింపు, ఎల్నినో పరిస్థితులు, వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ముఖ్యమంత్రి కేంద్ర మంత్రితో చర్చించారు. పిఎంఏవై-జి పథకంలో భాగంగా మొదటి విడతగా తెలంగాణకు 2 లక్షల ఇండ్లను కేటాయించినందుకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

పెట్రోల్ పంపుల్లో ఇకపై UPI పేమెంట్స్ లేనట్లేనా ?

పెట్రోల్ పంప్ యజమానుల డీలర్ కమీషన్ ఇప్పటికే చాలా తక్కువగా ఉండటంతో, ప్రతి పెద్ద లావాదేవీపై రూ.5 UPI ఛార్జీ చెల్లించడం తమకు భారీ ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుందని ఆల్ ఇండియా పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ వాపోతోంది. తమ నిర్దేశిత మార్జిన్ దెబ్బతింటుందని, ముంబై సహా పలు నగరాల్లోని బంకు యజమానులు UPI సేవలను నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇంధనం ధర నిర్ణయం, కమీషన్లు అన్నీ ప్రభుత్వ పర్యవేక్షణలోనే జరుగుతున్నందున, ఈ అదనపు భారాన్ని భరించడం తమకు సాధ్యం […]

బీఆర్‌ఎస్‌ నేత మన్నె క్రిశాంక్‌ అరెస్ట్‌

బిఆర్ఎస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్, కీలక నాయకుడు మన్నె క్రిషాంక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ సమయంలో ఆయన నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత, గందరగోళ పరిస్థితి నెలకొంది. ఏ విధమైన ముందస్తు సమాచారం, నోటీసులు ఇవ్వకుండా పోలీసులు తన ఇంటికి వచ్చి అదుపులోకి తీసుకున్నారని క్రిషాంక్ మద్దతుదారులు, కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఇంట్లో ఉన్న చిన్న పిల్లలను, కుటుంబ సభ్యులను ఈ విధంగా భయబ్రాంతులకు గురిచేసి ఏడిపించడం విచారకరమని పేర్కొన్నారు.

‘రూ. వెయ్యి కోట్లు ఇస్తే ఆస్తులన్నీ ఇస్తాం’.. సీఎం ఆరోపణలపై KTR సవాల్

ఫార్ములా ఈ-రేస్ కేసులో నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టు విచారణకు హాజరైన మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ కుటుంబం రూ. లక్ష కోట్లు కొల్లగొట్టిందని  రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై  కేటీఆర్ ఒక సంచలన ఆఫర్ విసిరారు. “మా కుటుంబ ఆస్తులన్నింటినీ ప్రభుత్వమే తీసుకుని, దానికి ప్రతిఫలంగా మాకు కేవలం రూ. వెయ్యి కోట్లు ఇస్తే ఎక్కడ సంతకం పెట్టమన్నా పెడతాను. మిగిలిన రూ. 99,000 కోట్లతో ప్రజలకు ఇచ్చిన హామీలను, సంక్షేమ పథకాలను […]

ఎర్రవల్లిలో రెండోరోజూ కొనసాగుతున్న భూముల సర్వే

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్ పరిసరాల్లోని భూములపై రెండోరోజూ అధికారులు సర్వే కొనసాగుతోంది. ప్రభుత్వ భూముల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. సర్వే నంబర్ 325లోని 388 ఎకరాల భూములపై ఆరా తీశారు. ఆ సర్వేనంబర్ లో ఎన్ని ఎకరాల ప్రభుత్వ భూమి ఉందో శాటిలైట్ సర్వే చేస్తున్నారు. సర్వేనంబర్లు, గతంలో ఉన్న రైతుల పేర్ల వివరాలను సైతం సేకరిస్తున్నారు. ఈ వివరాలను మర్కూక్ రెవెన్యూ అధికారులు నివేదిక రూపంలో సిద్ధం చేస్తున్నారు.ఎర్రవల్లి, వెంకటాపూర్, […]

గురుకులంలో మరో ప్రమాదం.. హస్టల్ రెండో అంతస్తు నుంచి కిందపడిన విద్యార్థి

నాగార్జునసాగర్ బీసీ గురుకుల బాలుర పాఠశాల నిరంతర నిర్లక్ష్యానికి, పర్యవేక్షణా లోపానికి మరోసారి నిదర్శనంగా నిలిచింది. శుక్రవారం పాఠశాల హాస్టల్ భవనం రెండో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడి 6వ తరగతి విద్యార్థి నరేందర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. వరుస ఘటనలు జరుగుతున్నా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. పాఠశాలలో జరుగుతున్న అక్రమాలు, ప్రమాదాలను బయటకు రాకుండా […]

షారుఖ్ ఖాన్ ‘కింగ్’ సినిమా సెట్స్ నుంచి ఫొటోలు లీక్.. నెట్టింట వైరల్!

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘కింగ్’ (King) చిత్రానికి సంబంధించిన షూటింగ్ స్పాట్ ఫొటోలు నెట్టింట లీకై సంచలనం సృష్టిస్తున్నాయి. సుజయ్ ఘోష్ దర్శకత్వంలో, సిద్ధార్థ్ ఆనంద్ పర్యవేక్షణలో అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. అయితే, ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే ఎప్పటికప్పుడు చిత్ర యూనిట్‌కు సంబంధించిన స్టిల్స్ లీక్ కావడం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

‘మీ దృక్పథాన్ని మార్చుకోండి’: హిందీపై తమిళనాడు వ్యతిరేకతపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య

విద్యాలయాల ఏర్పాటును వ్యతిరేకించడంపై మరోసారి ఆలోచించాలని సుప్రీంకోర్టు గురువారం సూచించింది. తమిళనాడులో హిందీని పూర్తిగా మినహాయించలేమని, ఢిల్లీలో ఉన్నవారికి ప్రజలు దూరమవ్వకూడదని కోర్టు అభిప్రాయపడింది. తమిళనాడు గడ్డపై హిందీ బోధనను అనుమతించమనే “వైఖరి”ని ఆ రాష్ట్రం మార్చుకోవాలని జస్టిస్ నాగరత్న అన్నారు. అంతేకాకుండా, భాషా పరమైన అంశంపై కేంద్రంతో తమిళనాడు చర్చలు జరపాలని ఆమె పేర్కొన్నారు. చెన్నై ప్రజలు ఢిల్లీకి, అలాగే ఢిల్లీ వారు చెన్నైకి దూరమవ్వకూడదు,” అని కోర్టు వ్యాఖ్యానించినట్లు ‘బార్ అండ్ బెంచ్’ నివేదించింది.

22ఏ సమస్యల పరిష్కారానికి హైలెవల్ కమిటీ

22ఏ సమస్యల ఫాస్ట్రాక్ పరిష్కారానికి హైలెవల్ కమిటీని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముగ్గురు అధికారులతో ఈ కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ ఛైర్మన్ సీసీఎల్ఎ కమిషనర్ ఉంటారు. ఇందులో సభ్యులుగా లా సెక్రటరీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ ఉంటారు. 118 జీవో బాధితులకు ఉపశమనం కలిగించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

అంధకారంలో బంగ్లాదేశ్..!

దేశవ్యాప్తంగా గంటల తరబడి పవర్ కట్‌లతో బంగ్లాదేశ్ అంధకారంలో కూరుకుపోయింది. తమ విద్యుత్ ఉత్పత్తిలో దాదాపు 44 శాతానికి పైగా కేవలం సహజ వాయువు పైనే ఆధారపడటం ఈ పరిస్థితికి ప్రధాన కారణమైంది. తగినంత విదేశీ మారక నిల్వలు లేకపోవడంతో సరుకు కొనుగోలు చేయలేక, స్థానిక ఉత్పత్తి పడిపోయి విద్యుత్ ప్లాంట్లు మూతపడే స్థాయికి చేరుకున్నాయి. ప్రధాన ఆసుపత్రులలో అత్యవసర వైద్య సేవలు, ఐసియులు, శస్త్రచికిత్సలకు విద్యుత్ లేక రోగుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON