ఫార్ములా ఈ-రేస్ కేసులో నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టు విచారణకు హాజరైన మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ కుటుంబం రూ. లక్ష కోట్లు కొల్లగొట్టిందని రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై కేటీఆర్ ఒక సంచలన ఆఫర్ విసిరారు. “మా కుటుంబ ఆస్తులన్నింటినీ ప్రభుత్వమే తీసుకుని, దానికి ప్రతిఫలంగా మాకు కేవలం రూ. వెయ్యి కోట్లు ఇస్తే ఎక్కడ సంతకం పెట్టమన్నా పెడతాను. మిగిలిన రూ. 99,000 కోట్లతో ప్రజలకు ఇచ్చిన హామీలను, సంక్షేమ పథకాలను అమలు చేయండి” అని సవాల్ చేశారు.