నాగార్జునసాగర్ బీసీ గురుకుల బాలుర పాఠశాల నిరంతర నిర్లక్ష్యానికి, పర్యవేక్షణా లోపానికి మరోసారి నిదర్శనంగా నిలిచింది. శుక్రవారం పాఠశాల హాస్టల్ భవనం రెండో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడి 6వ తరగతి విద్యార్థి నరేందర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. వరుస ఘటనలు జరుగుతున్నా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. పాఠశాలలో జరుగుతున్న అక్రమాలు, ప్రమాదాలను బయటకు రాకుండా తొక్కిపెడుతున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.