పెట్రోల్ పంప్ యజమానుల డీలర్ కమీషన్ ఇప్పటికే చాలా తక్కువగా ఉండటంతో, ప్రతి పెద్ద లావాదేవీపై రూ.5 UPI ఛార్జీ చెల్లించడం తమకు భారీ ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుందని ఆల్ ఇండియా పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ వాపోతోంది. తమ నిర్దేశిత మార్జిన్ దెబ్బతింటుందని, ముంబై సహా పలు నగరాల్లోని బంకు యజమానులు UPI సేవలను నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇంధనం ధర నిర్ణయం, కమీషన్లు అన్నీ ప్రభుత్వ పర్యవేక్షణలోనే జరుగుతున్నందున, ఈ అదనపు భారాన్ని భరించడం తమకు సాధ్యం కాదని చెప్తున్నారు.