మాదాపూర్‌లో కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పిఎంఏవై-జి (PMAY-G) ఇండ్ల కేటాయింపు, ఎల్నినో పరిస్థితులు, వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ముఖ్యమంత్రి కేంద్ర మంత్రితో చర్చించారు. పిఎంఏవై-జి పథకంలో భాగంగా మొదటి విడతగా తెలంగాణకు 2 లక్షల ఇండ్లను కేటాయించినందుకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.