loader

ఆదాయపు పన్ను కార్యాలయం భవనంలో అగ్నిప్రమాదం.. చిక్కుకున్న ఉద్యోగులు

మహారాష్ట్ర రాజధాని ముంబైలో చర్చిగేట్‌ ప్రాంతంలోని మహర్షి కర్వే రోడ్డులో ఉన్న ఇన్‌కమ్‌టాక్స్‌ భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఏడు అంతస్తులున్న ఈ బిల్డింగ్‌లోని బేస్‌మెంట్‌, ఫస్ట్‌ ఫ్లోర్‌ వరకు మంటలు వ్యాపించాయి. దీంతో పై అంతస్తుల్లో ఉన్న ఉద్యోగులు అక్కడ చిక్కుకుపోయారు. ఈ అగ్నిప్రమాదం గురించి తెలిసిన వెంటనే అగ్నిమాపక, అత్యవసర వాహనాలతో ఫైర్‌ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. ఒక బృందం మంటలు ఆర్పడంలో నిమగ్నం కాగా, పై అంతస్తుల్లో చిక్కుకున్న ఉద్యోగులను […]

రైతు రుణమాఫీని ప్రకటించిన సీఎం విజయ్

తమిళనాడు రైతాంగానికి ముఖ్యమంత్రి విజయ్ తీపి కబురు వినిపించారు. రైతు రుణాల మాఫీ పథకానికి సంబంధించి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 13.34 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరేలా మొత్తం రూ. 6,220 కోట్ల విలువైన పంట రుణాలను రద్దు చేస్తోన్నట్లు ఆయన వెల్లడించారు. రూ. 75,000 లోపు ఉన్న పంట రుణాలను సంపూర్ణంగా మాఫీ చేసినట్లు తెలిపారు. రూ.75,000 నుండి రూ.1,00,000 మధ్య ఉన్న పంట రుణాలకు గరిష్టంగా రూ.75,000 వరకు […]

వైసీపీ నేతలకు సీఎం చంద్రబాబు సవాల్

డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న వైసీపీ నేతలు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి ఆధారాలు చూపించాలని సీఎం చంద్రబాబు సవాల్ విసిరారు. వాళ్ల దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేనందునే సభకు రావడం లేదని విమర్శించారు. గత రెండేళ్లుగా అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటూ.. సౌకర్యాలు పొందుతున్నారని విమర్శించారు. వైసీపీ నేతలు సభకు రాకుండా రోడ్లపై ఆందోళనలు చేస్తున్నారని, ఇక్కడికి వస్తే దొరికిపోతామనేదే వారి భయమని సీఎం చంద్రబాబు ఎద్దేవా చేశారు. కేవలం 148 రోజుల్లోనే డీఎస్సీని అత్యంత పారదర్శకంగా […]

బీజేపీ కొత్త కార్యవర్గం ప్రకటన

బీజేపీ కొత్త కార్యవర్గాన్ని జాతీయ అధ్యక్షుడు నితిన్ నఖిన్ ప్రకటించారు. జనరల్ సెక్రటరీలుగా వినోద్ తాక్తే, స్మృతి ఇరానీ ఎంపికయ్యారు. 13 మందిని జాతీయ ఉపాధ్యక్షులుగా నియమించారు. వీరిలో ఏపీకి చెందిన రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరికి చోటు లభించడం గమనార్హం. పీయూష్ గోయల్ జాతీయ కోశాధికారిగా నియమితులయ్యారు. ఇక అత్యంత కీలకమైన పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శిగా బి.ఎల్.సంతోషను కొనసాగించారు. కేంద్ర కార్యాలయం ఇన్ఛార్జిగా తరుణ్ చుగ్ ఎంపికయ్యారు. కొత్త కార్యవర్గంలో తెలంగాణకు చోటు దక్కలేదు.

ఉజ్జయినిలో తొక్కిసలాట.. పలువురికి గాయాలు!

ఉజ్జయినిలోని పవిత్ర శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయంలో శ్రావణ సోమవారం మరియు నాగ పంచమి పర్వదినాల సందర్భంగా తీవ్ర విచారం చోటుచేసుకుంది. ఒకే రోజు రెండు పవిత్రమైన పండుగలు రావడంతో శ్రీ కాళ భైరవుడు, మహాకాళేశ్వరుని దర్శనార్థం లక్షలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. విపరీతమైన భక్తుల రద్దీ మరియు నెట్టివేతల కారణంగా ప్రాంగణంలో తొక్కిసలాట వంటి పరిస్థితిర్పడి పలువురు భక్తులు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు

భాజపాలో చేరిన డ్యాన్స్ కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ..

డ్యాన్స్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ భాజపాలో చేరారు. తెలంగాణ భాజపా రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. శ్రష్టి వర్మతో పాటు మరికొంతమంది కూడా భాజపా తీర్థం పుచ్చుకున్నారు. ‘పుష్ప 2’ లో ‘సూసేకి..’ పాట శ్రష్టికి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇక రజనీకాంత్ ‘జైలర్’ లో ‘నువ్వు కావాలయ్యా’ పాటకు నృత్యరీతులు సమకూర్చారు.’అల వైకుంఠపురములో’, ‘ సహా పలు తెలుగు, తమిళ, […]

కల్యాణ లక్ష్మి పథకాన్ని కొనసాగించాలని : ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్‌

రేవంత్ రెడ్డి ప్రభుత్వం కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను రద్దు చేయడానికి పూనుకుంది. ఈ పథకాలను కొనసాగించాలని బీఆర్‌ఎస్ నాయకుడు ఆర్‌ఎస ప్రవీణ్‌ కుమార్‌ డిమాండ్ చేశారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పతకాలు కొనసాగించాలని..డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో జరిగిన అక్రమాల పై విచారణ జరిపి అర్హులకు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల భరత్ కుమార్ ఆధ్వర్యంలో నల్లగొండ కలెక్టర్ కార్యాలయం వద్ద బీఆర్‌ఎస్‌ పార్టీ ధర్నా […]

మనిషి పెరిగితే సరిపోదు.. అచ్చెన్నకు బొత్స స్ట్రాంగ్ కౌంటర్

డీఎస్సీ అక్రమాలపై చర్చ జరగాల్సిందేనని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. తనను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి అచ్చెన్నాయుడికి బొత్స గట్టి కౌంటర్ ఇచ్చారు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై బొత్స తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “మనిషి పెరిగితే సరిపోదు.. బాష కూడా బాగుండాలి. సభలో ఎలా మాట్లాడాలో అచ్చెన్నాయుడు నేర్చుకోవాలి. తోటి సభ్యులకు గౌరవం ఇచ్చి మాట్లాడాలి. డీఎస్సీ పై చర్చ జరగాలన్నదే మా డిమాండ్. లోకేశ్ రాజీనామా చేసి.. సీబీఐతో […]

కావేరి జలాలు విషయంలో కర్ణాటకకు బిగ్ షాక్ ఇచ్చిన సుప్రీం కోర్ట్

తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న కావేరీ జలాల వివాదంలో కర్ణాటక ప్రభుత్వానికి అత్యున్నత  నాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కావేరి నదీ జలాలను వెంటనే తమిళనాడుకు విడుదల చేయాలని సుప్రీంకోర్టు కర్ణాటక  ప్రభుత్వాన్ని స్పష్టంగా ఆదేశించింది.కావేరి నీటి నిర్వహణ అథారిటీ (CWMA) నిర్దేశించిన నిబంధనలు మరియు ఆదేశాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాల్సిందేనని తేల్చిచెప్పిన ధర్మాసనం, 12 రోజుల పాటు రోజుకు 12,000 క్యూసెక్కుల చొప్పున నీటిని దిగువకు విడుదల చేయాలని స్పష్టం చేసింది.

వైకాపా సభ్యుల ఆందోళనలతో శాసనమండలి వాయిదా

వైకాపా సభ్యుల ఆందోళనతో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడింది. డీఎస్సీపై వాయిదా తీర్మానాలను ఛైర్మన్ తిరస్కరించారు. దీంతో వైకాపా సభ్యులు నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలకు అడ్డు తగిలారు. వారి ఆందోళనల మధ్యే చైర్మన్ ప్రశ్నోత్తరాలు కొసాగించే ప్రయత్నం చేశారు. సభా గౌరవాన్ని కించపరిచేవిధంగా ప్రవర్తించడం సరికాదన్న మంత్రి నాదెండ్ల మనోహర్.. సభను ఆర్డర్ లో పెట్టాలంటూ సూచించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON