రేవంత్ రెడ్డి ప్రభుత్వం కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను రద్దు చేయడానికి పూనుకుంది. ఈ పథకాలను కొనసాగించాలని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పతకాలు కొనసాగించాలని..డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో జరిగిన అక్రమాల పై విచారణ జరిపి అర్హులకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల భరత్ కుమార్ ఆధ్వర్యంలో నల్లగొండ కలెక్టర్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేపట్టింది.