తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న కావేరీ జలాల వివాదంలో కర్ణాటక ప్రభుత్వానికి అత్యున్నత నాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కావేరి నదీ జలాలను వెంటనే తమిళనాడుకు విడుదల చేయాలని సుప్రీంకోర్టు కర్ణాటక ప్రభుత్వాన్ని స్పష్టంగా ఆదేశించింది.కావేరి నీటి నిర్వహణ అథారిటీ (CWMA) నిర్దేశించిన నిబంధనలు మరియు ఆదేశాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాల్సిందేనని తేల్చిచెప్పిన ధర్మాసనం, 12 రోజుల పాటు రోజుకు 12,000 క్యూసెక్కుల చొప్పున నీటిని దిగువకు విడుదల చేయాలని స్పష్టం చేసింది.