తమిళనాడు రైతాంగానికి ముఖ్యమంత్రి విజయ్ తీపి కబురు వినిపించారు. రైతు రుణాల మాఫీ పథకానికి సంబంధించి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 13.34 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరేలా మొత్తం రూ. 6,220 కోట్ల విలువైన పంట రుణాలను రద్దు చేస్తోన్నట్లు ఆయన వెల్లడించారు. రూ. 75,000 లోపు ఉన్న పంట రుణాలను సంపూర్ణంగా మాఫీ చేసినట్లు తెలిపారు. రూ.75,000 నుండి రూ.1,00,000 మధ్య ఉన్న పంట రుణాలకు గరిష్టంగా రూ.75,000 వరకు మాఫీ వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు.