డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న వైసీపీ నేతలు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి ఆధారాలు చూపించాలని సీఎం చంద్రబాబు సవాల్ విసిరారు. వాళ్ల దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేనందునే సభకు రావడం లేదని విమర్శించారు. గత రెండేళ్లుగా అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటూ.. సౌకర్యాలు పొందుతున్నారని విమర్శించారు. వైసీపీ నేతలు సభకు రాకుండా రోడ్లపై ఆందోళనలు చేస్తున్నారని, ఇక్కడికి వస్తే దొరికిపోతామనేదే వారి భయమని సీఎం చంద్రబాబు ఎద్దేవా చేశారు. కేవలం 148 రోజుల్లోనే డీఎస్సీని అత్యంత పారదర్శకంగా ఒక్క తప్పు లేకుండా నిర్వహించామన్నారు.