బీజేపీ కొత్త కార్యవర్గాన్ని జాతీయ అధ్యక్షుడు నితిన్ నఖిన్ ప్రకటించారు. జనరల్ సెక్రటరీలుగా వినోద్ తాక్తే, స్మృతి ఇరానీ ఎంపికయ్యారు. 13 మందిని జాతీయ ఉపాధ్యక్షులుగా నియమించారు. వీరిలో ఏపీకి చెందిన రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరికి చోటు లభించడం గమనార్హం. పీయూష్ గోయల్ జాతీయ కోశాధికారిగా నియమితులయ్యారు. ఇక అత్యంత కీలకమైన పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శిగా బి.ఎల్.సంతోషను కొనసాగించారు. కేంద్ర కార్యాలయం ఇన్ఛార్జిగా తరుణ్ చుగ్ ఎంపికయ్యారు. కొత్త కార్యవర్గంలో తెలంగాణకు చోటు దక్కలేదు.