ఉజ్జయినిలోని పవిత్ర శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయంలో శ్రావణ సోమవారం మరియు నాగ పంచమి పర్వదినాల సందర్భంగా తీవ్ర విచారం చోటుచేసుకుంది. ఒకే రోజు రెండు పవిత్రమైన పండుగలు రావడంతో శ్రీ కాళ భైరవుడు, మహాకాళేశ్వరుని దర్శనార్థం లక్షలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. విపరీతమైన భక్తుల రద్దీ మరియు నెట్టివేతల కారణంగా ప్రాంగణంలో తొక్కిసలాట వంటి పరిస్థితిర్పడి పలువురు భక్తులు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు