loader

రెండు యూఏఈ చమురు ట్యాంకర్లపై డ్రోన్ దాడులు

హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న తమ దేశానికి చెందిన రెండు చమురు ట్యాంకర్లపై ఇరాన్ డ్రోన్లతో  దాడి చేసిందని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) శుక్రవారంనాడు ఆరోపించింది. ఈ దాడులను సముద్ర దోపిడీ చర్యలుగా పేర్కొంది. అబుదాబీ ప్రభుత్వరంగ చమురు, సహజవాయివు సంస్థ అయిన అడ్నోక్‌కు చెందిన రెండు ట్యాంకర్లపై గురువారం సాయంత్రం ఈ దాడి జరిగినట్టు ఆ సంస్థ తెలిపింది. రెండు నౌకలు డ్రోన్ దాడుల్లో స్వల్పంగా దెబ్బతిన్నట్టు తమకు సమాచారం ఉందని బ్రిటిష్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ కేంద్రం కూడా తెలిపింది.

నాకు తెలియకుండానే నిర్ణయమా? అధికారులపై డీకే శివకుమార్ ఆగ్రహం

కర్ణాటకలో గుట్కాను నిషేధిస్తూ కొద్ది రోజుల క్రితం జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం వెనక్కి తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని లక్షలాది మంది వక్క (అడక) రైతులు తీవ్రంగా నష్టపోతారని ఎమ్మెల్యేలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో గుట్కా నిషేధ ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని ముఖ్యమంత్రి డీకే ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇంతటి కీలకమైన నిర్ణయం తన దృష్టికి రాకుండా ఎలా జారీ చేశారంటూ సీఎం ఆరోగ్యశాఖ కార్యదర్శిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీస్‌ జాబ్స్‌.. వయోపరిమితి పెంపు

యూనిఫామ్ సర్వీసెస్ ఉద్యోగాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితిని రెండేళ్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఏజ్ రిలాక్సేషన్కు అదనంగా ఈ రెండేళ్ల వయోపరిమితిని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. యువత విజ్ఞప్తులను పరిశీలించిన తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

అభివృద్ధి చెందిన భారత్‌ లక్ష్యంగా ప్రయాణం: రాష్ట్ర‌ప‌తి సందేశం

స్వాతంత్ర్యం అంటే కేవలం బానిసత్వం నుంచి విముక్తి పొందడం మాత్రమే కాదని, ప్రతి పౌరుడికి తన సామర్థ్యాన్ని చాటుకునే అవకాశాలు కల్పించడం కూడా స్వేచ్ఛలో భాగమని రాష్ట్రపతి సందేశమిచ్చారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, ప్రజాస్వామ్య భాగస్వామ్యం, సాంకేతిక పురోగతి, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణతో కూడిన అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపునిచ్చారు. గత దశాబ్ద కాలంలో భారతదేశం వేగవంతమైన, సమ్మిళిత వృద్ధిని సాధించిందని రాష్ట్రపతి అన్నారు.

అంబేద్కర్‌ ఆశయాల నుంచి వికసిత్‌ భారత్‌ వరకు

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ అందించిన రాజ్యాంగ విలువలు, సమానత్వం, సామాజిక న్యాయం వంటి ఆశయాలను ప్రజలు గుర్తుంచుకోవాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధి ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికి అందేలా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రజలందరూ తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. జాతీయ గీతాలు, దేశ చరిత్ర, స్వాతంత్ర పోరాట విలువలను గౌరవించాలని, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి లక్ష్యాలతో ప్రజలంతా ఐక్యంగా ముందుకు సాగాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు.

80వ స్వాతంత్ర దినోత్స‌వం వేళ రాష్ట్ర‌ప‌తి సందేశం

80వ స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు రోజు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ అభివృద్ధి ప్రస్థానం, ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, సాంకేతిక పురోగతి, సాంస్కృతిక వారసత్వం, భవిష్యత్ భారతదేశ లక్ష్యాలపై ఆమె ప్రసంగంలో ప్రస్తావించారు. దేశ, విదేశాల్లో ఉన్న భారతీయులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఎర్రకోటపైనే జెండా ఎందుకు ఎగురవేస్తారో తెలుసా?

కొన్ని శతాబ్దాల పాటు భారత్‌ను ఏలిన మొఘల్ సామ్రాజ్యానికి, ఆ తర్వాత దేశాన్ని తన గుప్పిట్లోకి తీసుకున్న బ్రిటిష్ పాలనకు ఎర్రకోటే కేంద్రంగా నిలిచింది. పరాయి పాలనకు సవాలుగా, విదేశీ ప్రభుత్వాల అణచివేతకు చిహ్నంగా ఉన్న ఈ ప్రాచీన కోటపై మన జాతీయ జెండాను ఎగురవేయడం ద్వారా విదేశీ పాలన అంతమై, స్వతంత్ర భారతం ఆవిర్భవించిందనే బలమైన సందేశాన్ని ప్రపంచానికి చాటిచెప్పడమే దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. దేశ తొలి ప్రధాని నెహ్రూ ఎర్రకోటలో మొట్టమొదటిసారిగా […]

రాహుల్ సిప్లిగంజ్‌కు ఆ వివాదంతో సంబంధం లేదు.. బాధితురాలి కీలక వ్యాఖ్యలు!

విశాఖ యువతిని ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేశారనే ఆరోపణలతో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ రాహుల్ సిప్లిగంజ్ తనను బెదిరించారనే ఆరోపణలు, కేసు వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే తాజాగా బాధితురాలు అసలు వివాదం తనకు, రాహుల్ రెడ్డికి మధ్య వ్యవహారమని స్పష్టం చేశారు. వివాదంతో రాహుల్ సిప్లిగంజ్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆమె పేర్కొన్నారు. రాహుల్ రెడ్డికి బంధువు కావడంతో రాహుల్ సిప్లిగంజ్ పేరు ఈ వ్యవహారంలోకి వచ్చిందని బాధితురాలు వెల్లడించారు. అయితే ఆయన […]

గ్రీన్‌కార్డు ఉన్న భారత సంతతి మహిళ నిర్బంధం!

అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రానికి చెందిన ఓ భారత సంతతి మహిళ గ్రీన్ కార్డు నిబంధనల ఉల్లంఘన ఆరోపణల కేసును స్థానిక న్యాయస్థానం కొట్టివేసిన కొన్ని నెలలకే ఇమిగ్రేషన్ అధికారులు ఆమెను నిర్బంధించినట్లు సమాచారం. బాధితురాలి కుటుంబ సభ్యులు.. తక్షణమే ఆమెను విడుదల చేయాలంటూ ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేరీ కౌంటీకి చెందిన నరసమాంబ వాసంశెట్టి (59) 2013 నుంచి గ్రీన్ కార్డుపై అమెరికాలో ఉంటున్నారు. ఆమె పిల్లలు కూడా అమెరికా పౌరులే. ఆమెపై […]

“పరువుతీయకండి రాహుల్” – కాంగ్రెస్ స్కిట్ లో “మెలోనీ” ప్రస్తావనపై కేంద్రం ఫైర్ ..!

రాహుల్ గాంధీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోడీ విదేశాంగ విధానాన్నిటార్గెట్ చేస్తూ దీక్షిత్ ను దూరం నుంచి ప్రధాని మోడీ తరహాలో చేతులు చాపుతూ వచ్చి రాహుల్ గాంధీ కౌగిలించుకున్నారు. మన విదేశాంగ విధానం ఇలా ఉందని ఆయన ఆరోపించారు. మెలోనీ అనుకోలేదు కదా అని దీక్షిత్ సరదాగా అనగా.. రాహుల్ నేను ఇంకా ఆ స్థాయికి వెళ్లలేదన్నారు. విదేశీ నాయకులను ఉద్దేశించి చేసే రాజకీయ వ్యాఖ్యలలో సంయమనం, గౌరవం పాటించాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON