యూనిఫామ్ సర్వీసెస్ ఉద్యోగాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితిని రెండేళ్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఏజ్ రిలాక్సేషన్కు అదనంగా ఈ రెండేళ్ల వయోపరిమితిని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. యువత విజ్ఞప్తులను పరిశీలించిన తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.