స్వాతంత్ర్యం అంటే కేవలం బానిసత్వం నుంచి విముక్తి పొందడం మాత్రమే కాదని, ప్రతి పౌరుడికి తన సామర్థ్యాన్ని చాటుకునే అవకాశాలు కల్పించడం కూడా స్వేచ్ఛలో భాగమని రాష్ట్రపతి సందేశమిచ్చారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, ప్రజాస్వామ్య భాగస్వామ్యం, సాంకేతిక పురోగతి, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణతో కూడిన అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపునిచ్చారు. గత దశాబ్ద కాలంలో భారతదేశం వేగవంతమైన, సమ్మిళిత వృద్ధిని సాధించిందని రాష్ట్రపతి అన్నారు.