కొన్ని శతాబ్దాల పాటు భారత్‌ను ఏలిన మొఘల్ సామ్రాజ్యానికి, ఆ తర్వాత దేశాన్ని తన గుప్పిట్లోకి తీసుకున్న బ్రిటిష్ పాలనకు ఎర్రకోటే కేంద్రంగా నిలిచింది. పరాయి పాలనకు సవాలుగా, విదేశీ ప్రభుత్వాల అణచివేతకు చిహ్నంగా ఉన్న ఈ ప్రాచీన కోటపై మన జాతీయ జెండాను ఎగురవేయడం ద్వారా విదేశీ పాలన అంతమై, స్వతంత్ర భారతం ఆవిర్భవించిందనే బలమైన సందేశాన్ని ప్రపంచానికి చాటిచెప్పడమే దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. దేశ తొలి ప్రధాని నెహ్రూ ఎర్రకోటలో మొట్టమొదటిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు