విశాఖ యువతిని ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేశారనే ఆరోపణలతో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ రాహుల్ సిప్లిగంజ్ తనను బెదిరించారనే ఆరోపణలు, కేసు వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే తాజాగా బాధితురాలు అసలు వివాదం తనకు, రాహుల్ రెడ్డికి మధ్య వ్యవహారమని స్పష్టం చేశారు. వివాదంతో రాహుల్ సిప్లిగంజ్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆమె పేర్కొన్నారు. రాహుల్ రెడ్డికి బంధువు కావడంతో రాహుల్ సిప్లిగంజ్ పేరు ఈ వ్యవహారంలోకి వచ్చిందని బాధితురాలు వెల్లడించారు. అయితే ఆయన తనను బెదిరించలేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.